Monday, 17 August 2020

India reports highest ever single day recoveries of 57,584

India reports highest ever single day recoveries of 57,584

Recovery Rate races beyond 72%

Total recoveries soon to cross 2 million

Posted On: 17 AUG 2020 1:46PM by PIB Delhi
India has been marching firmly on the road to enhanced recoveries every day. Today, the country registered the highest single day recoveries with as many as 57,584 COVID-19 patients getting cured and discharged in the last 24 hours.
This achievement has further spurred India's Recovery Rate to cross the 72% milestone. This is the result of successful and coordinated implementation of an effective containment strategy, aggressive and comprehensive testing coupled with standardized clinical management of the critical patients. India has followed a Standard of Care protocol for the differentiated categorisation of COVID-19 patients- mild, moderate and severe as clearly formulated in the Clinical Management Protocol of Ministry of Health & Family Welfare (MoHFW). The effective clinical management strategies have shown to yield positive results.
With more patients recovering and being discharged from hospitals and home isolation (in case of mild and moderate cases), India's COVID-19 recoveries have reached nearly 2 million (19,19,842). This has ensured that the difference between the recovered and active cases continues to expand. It is 12,42,942 today.
The actual case load of the country, viz. the Active Cases (6,76,900 on date) has reduced and currently comprises only 25.57% of the total positive cases. Early identification of cases has helped to ensure timely and prompt isolation of the mild and moderate cases and hospitalisation of the severe and critical cases thereby leading to timely and effective management of cases. The Case Fatality Rate has further slumped today touching 1.92%.

భారత్ లో ఒకరోజులో గరిష్ఠంగా కోలుకున్నవారి సంఖ్య 57,584
72%వైపు దూసుకెళుతున్న కోలుకున్నవారిశాతం

20 లక్షలు దాటనున్న మొత్తం కోలుకున్నవారి సంఖ్య


కోవిడ్ కోలుకున్నవారి సంఖ్య బాగా భారత్ లో రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఈ రోజు దేశంలో అత్యధిక సంఖ్యలో 57,584 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో వీళ్ళంతా ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ కావటమో, ఐసొలేషన్ నుంచి బైటికి రావటమో జరిగింది. 

దీంతో భారత్ లో కోలుకున్నవారి శాతం 72% మైలురాయిని దాటటానికి సిద్ధమవుతోంది. నివారణ చర్యలను సమన్వయంతో సమర్థంగా వేగవంతం చేయటం, దూకుడుగా, సమగ్రంగా పరీక్షలు జరపటం, ప్రామాణీకరించిన చికిత్సా విధానాలు పాటించటం, వ్యాధి తీవ్రత ఆధారంగా వర్గీకరించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన చికిత్స అందించటం తగిన ఫలితాలనిచ్చింది.

ఇలా రోజురోజుకూ ఎక్కువమంది బాధితులు కోలుకొని ఆస్పత్రులనుంచి, ఐసొలేషన్ నుంచి బైటికి వస్తూ ఉండటంతో భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య దాదాపుగా 20 లక్షలకు (కచ్చితంగా చెప్పాలంటే 19,19,842) చేరువవుతూ వస్తోంది. దీనివలన బాధితులకూ, కోలుకున్నవారికీ మధ్య తేడా పెరుగుతూ నేటికి అది 12,42,942 కు చేరింది.


దేశం మీద బాధితుల  భారం అలా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 6,76,900 కు చేరింది. అంటే పాజిటివ్ గా నమోదైనవారిలో ఇంకా చికిత్సలో ఉన్నవారు 25.57% మాత్రమే ఉన్నారు. తొలిదశలోనే గుర్తించి స్వల్ప లక్షణాలున్నవారిని ఐసొలేషన్ లో ఉంచటం, ఒకమోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్నవారిని ఆస్పత్రులకు తరలించటం కారణంగా సమర్థంగా చికిత్స అందించే వీలు కలిగింది. ఈరోజుకు పాజిటివ్ కేసులలో మరణించినవారి శాతం 1.92 దగ్గర నిలచింది.

No comments:

Post a Comment